News March 30, 2025

NGKL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.

News November 24, 2025

జనగామ: రేపు కలెక్టరేట్‌లో దిశా కమిటీ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని వసంత తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, దిశా కమిటీ మెంబర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News November 24, 2025

తిరుపతిలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

image

తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డులో ఉదయాన్నే మద్యం విక్రయిస్తున్నారు. ఇదే విషయమై Way2Newsలో ఆదివారం <<18364526>>‘పొద్దుపొద్దున్నే.. ఇచ్చట మద్యం అమ్మబడును..?’ <<>>అంటూ వార్త ప్రచురితమైంది. ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. వైన్ షాప్ పక్కనే మద్యం విక్రయిస్తున్న సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 6మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ రామచంద్ర వెల్లడించారు.