News February 23, 2025
NGKL: నేడే గురుకుల విద్యాలయాలకు ప్రవేశ పరీక్ష

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హాల్టికెట్లతో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్కార్డు, పాస్ఫొటోలతో రావాలని సూచించారు. ఉ. 11 గం. నుంచి మ.1 గంట వరకు జరిగే పరీక్షకు ఉ.9 గం.లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
సత్తుపల్లిలో 3,000 ఉద్యోగాలకు మెగా జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో TASKసహకారంతో ఈ నెల 26న సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఓసీ పీఓలు ప్రహ్లాద్, ఎంవీ. నరసింహారావులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన 50 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. ఇంటర్వ్యూలను 23, 24, 25 తేదీలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేపట్టనున్నారు. నిరుద్యోగులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 19, 2025
బద్వేల్ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్

బద్వేల్పై TDP అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ విషయంలో నియోజకవర్గంలోని ప్రజలకు IVRS కాల్స్ చేసి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితీశ్ రెడ్డి, DCC బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లను పేర్కొంది. బద్వేలులో ఎవరైనా నాయకుడిగా ఎదిగారంటే అది వీరారెడ్డి కుటుంబం దయేనని, రితీశ్ రెడ్డే తమ నాయకుడు అని పలువురు TDP నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు.
News October 19, 2025
వరంగల్: నేడు భోగి.. 22 వరకు దీపావళి సందడి

ఇంటిల్లిపాదినీ అలరించే దివ్వెల పండగ రానే వచ్చింది. నేడు భోగి పండగతో ప్రారంభమయ్యే వేడుకలు ఈ నెల 21న నోములతో ముగుస్తాయి. 20న దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. భోగి స్నానాలతో ప్రారంభమై కేదారీశ్వర వ్రతాలు నోములు ఎత్తుకునే వరకు వేడుకలు జోరుగా సాగుతాయి. దీపావళిని పురస్కరించుకొని పూల దుకాణాలు, నోము సామానులు, టపాసుల షాపులు సిద్ధమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి నెలకొంది.