News February 20, 2025
NGKL: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండిని కలిసిన ఎంపీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చంద్రను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, అల్లంపూర్ నియోజకవర్గాలలోని యువత గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే విధంగా లోన్ మేళా నిర్వహించాలని కోరినట్లు, ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
Similar News
News November 17, 2025
పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.

పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.