News April 6, 2025
NGKL: పండగను శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య పండగను చేసుకోవాలన్నారు. ప్రకృతిని రక్షించాలని అప్పుడే మనం రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించిన వారమవుతామని తెలిపారు.
Similar News
News October 17, 2025
త్వరలో కౌలు రైతులకు యూనిక్ ఐడీ నంబర్!

AP: రాష్ట్రంలోని కౌలు రైతులకు(పంట సాగుదారు హక్కుపత్రం) యూనిక్ ఐడీ నంబర్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో భూములున్న రైతులతో పాటే వీరు కూడా రాయితీలు, ప్రయోజనాలు పొందే అవకాశముంటుంది. ఇప్పటి వరకూ భూములున్న రైతులకే కేంద్రం విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తోంది. CM చంద్రబాబు సూచనల మేరకు కౌలు రైతులకూ ఈ నంబర్ జారీ చేయడంపై దృష్టి సారించింది. టెక్నికల్గా పరీక్షించిన తర్వాత దీనిని అమలు చేయనుంది.
News October 17, 2025
చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 17, 2025
అధికారులకు షోకాజ్ నోటీస్లు జారీ చేయండి: కలెక్టర్

గృహ నిర్మాణ ప్రగతిపై నిర్వహించిన సమావేశానికి హాజరుకాని ఐదుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణాల లక్ష్యసాధనలతో అధికారులు కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలన్నారు. లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణంలో అలసత్వం వహించే కాంట్రాక్టులను తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు.