News March 3, 2025
NGKL: పాముకాటుతో రైతు మృతి

పొలంలో పనిచేస్తున్న రైతును పాము కాటేయటంతో మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఉర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన సాయిరెడ్డి(65) పొలంలో పనిచేసుకుంటుండగా పాము కాటేసింది. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. పరిస్థతి విషమించటంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.
Similar News
News November 22, 2025
‘యాషెస్’ను అసూయతో చూశా: సౌతాఫ్రికా కెప్టెన్

5 టెస్టుల యాషెస్ సిరీస్ను చూస్తే అసూయగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నారు. ఇండియాతో టెస్టు సిరీస్ 2 మ్యాచులకే పరిమితం చేయడంపై ఇలా అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘యాషెస్ను చూడటానికి ఉదయాన్నే మేం లేచాం. వాళ్లు 5 టెస్టులు ఆడుతున్నారని తెలిసి అసూయతో చూశాం’ అని చెప్పారు. త్వరలో పరిస్థితి మారుతుందని అనుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో భారత్తో 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు వస్తామని పేర్కొన్నారు.
News November 22, 2025
అనకాపల్లి: వీరికి వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరి

గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వీరజ్యోతి సూచించారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్యారోగ్యశాఖ సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే వ్యాధి నిరోధక టీకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 21న నిర్వహించే పల్స్ పోలియోపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.
News November 22, 2025
ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8


