News June 6, 2024

NGKL: పిడుగు పడి భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

image

పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన NGKL జిల్లా వెల్దండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన బేగారి జంగమ్మ (47) విత్తనాలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లింది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఈ క్రమంలో పిడుగు పడి జంగమ్మ మృతిచెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 9, 2025

MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

image

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.

News December 9, 2025

MBNR: ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలి: కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన పి.ఓలు, ఓ.పి.ఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనల అనుసరించి క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.

News December 9, 2025

MBNR: ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ: ఎస్పీ

image

ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డీ.జానకి అన్నారు. ఓటును కొనడం లేదా అమ్మడం చట్టపరంగా పెద్ద నేరం అని ఆమె హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు పాల్పడడం పూర్తిగా నిషేధం అని ఎస్పీ స్పష్టం చేశారు.