News March 22, 2025
NGKL: పెద్దకొత్తపల్లి లో38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లా లో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా పెద్దకొత్తపల్లి లో 38.8 ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దూర్ 38.7, అచ్చంపేట,వంగూరు38.6, కొల్లాపూర్38.4, ఉప్పునుంతల38.3, బిజినపల్లి 38.1, కల్వకుర్తి,చారకొండ38.0, బల్మూర్37.8 తెలకపల్లి,పెంట్లవెల్లి37.5,నాగర్ కర్నూల్37.0 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 24, 2025
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.
News November 24, 2025
అల్లూరి జిల్లాలో సెల్టవర్ కోసం గ్రామస్థుల వినతి

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ, సన్యాసమ్మపాలెం గ్రామాలకు ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు సెల్టవర్ ఏర్పాటుకు సంతకాల సేకరణ చేపట్టారు. దాదాపు 2,000 జనాభాలో 1,500 మంది ఫోన్ వాడుతున్న నేపథ్యంలో ఈ సేవలు అత్యవసరమని తెలిపారు. సేకరించిన దరఖాస్తును సోమవారం పాడేరు ఐటీడీఏ పీవో పూజకు సమర్పించనున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.
News November 24, 2025
314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.


