News April 10, 2025

NGKL: పోలీస్ వాహనంతో రీల్స్.. SP స్పందన ఇదే!

image

పోలీస్ వాహనంలో రీల్స్‌పై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ బుధవారం స్పందించారు. ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు మనవడు టిఫిన్స్ తెచ్చుకోవడానికి పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్ చేశాడు. పోలీస్ వాహనం దొంగతనం జరగలేదన్నారు. ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఎస్ఐ వీరమల్లుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో ఎవరిపై కేసు నమోదు చేయలేదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

image

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.

News December 2, 2025

‘రైతన్న.. మీకోసం’లో కర్నూలుకు రాష్ట్రంలో మొదటి స్థానం

image

వారం రోజులు నిర్వహించిన ‘రైతన్న.. మీకోసం’లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచసూత్రాలు వివరించి, ఫొటోలు పోర్టల్‌లో అప్లోడ్ చేయడం అత్యధిక శాతం నమోదు కావడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ఈనెల 2, 3వ తేదీల్లో రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్‌షాపులను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News December 2, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?