News March 13, 2025

NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

image

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 1, 2025

సంగారెడ్డి: ఉద్యోగాల కౌన్సిలింగ్‌కు 24 మంది హాజరు

image

జిల్లా వైద్య శాఖలో తొమ్మిది రకాల ఉద్యోగాల కోసం నిర్వహించిన కౌన్సిలింగ్‌కు 24 మంది హాజరైనట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శనివారం తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగిందని చెప్పారు. కౌన్సిలింగ్‌కు ఉద్యోగులకు కేటాయించిన స్థానాలు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.

News November 1, 2025

సంగారెడ్డి: ‘ఈనెల 14 లోగా ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలి’

image

ఇంటర్ ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 14 లోపు కళాశాలలో విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ.100 ఫైన్‌తో ఈనెల 24 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 1 వరకు, రూ.2000 ఫైన్‌తో డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News November 1, 2025

పాలమూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల..!

image

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే B.Ed NON-CBCS (బ్యాక్‌లాగ్) పరీక్షల తేదీలు (టైం టేబుల్)ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 3 నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comను తనిఖీ చేయవచ్చన్నారు.