News March 13, 2025

NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

image

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేసింది. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 25, 2025

జనగామ: ‘ఎల్ఆర్ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జనగామ పట్టణ పరిధిలో ఉన్న ఫ్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)ను ఈ నెల 31 వరకు చేసుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు. 25% డిస్కౌంట్‌తో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని పట్టణ వాసులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మళ్లీ క్రమబద్ధీకరణ తేదీని పెంచే అవకాశం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

News March 25, 2025

విశాఖలో 15 మందిపై పీడీ యాక్ట్..!

image

విశాఖ సిటీలో రౌడీ షీటర్ల ఆగడాలు నివారించేందుకు విశాఖ సీపీ కఠిన చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారి వివరాలు సేకరిస్తూనే పలువురుపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. తాజాగా సీతంపేట, కొబ్బరితోట ప్రాంతాలకు చెందిన వై.కుమార్, వై.ఎర్రన్నలపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయగా.. వీరిద్దరితో ఆ సంఖ్య 15కు చేరింది.

News March 25, 2025

కేసుల పరిష్కారానికి కృషి చేస్తా: APP

image

కామారెడ్డి కేసుల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, జిల్లా కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవుని సూర్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, పట్టణ ఎనిమిదవ వార్డు పార్టీ ఇంచార్జి గంప ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

error: Content is protected !!