News March 13, 2025
NGKL: ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన సల్వాది లక్ష్మయ్య, నర్సమ్మల కుమార్తె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన యువతి ఉద్యోగం సాధించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 14, 2026
MGU: డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు ‘చివరి ఛాన్స్’

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 2011-12 నుంచి 2018-19 బ్యాచ్ డిగ్రీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు సి.ఓ.ఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి చివరి అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు తమ పెండింగ్ సబ్జెక్టుల పరీక్ష ఫీజును మార్చి 4 వరకు చెల్లించవచ్చు. రూ. 100 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు గడువు ఉంది. ఇది వన్ టైమ్ ఛాన్స్ మాత్రమేనని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
News February 14, 2026
రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.
News February 14, 2026
దుబ్బాకలో మహిళా లీడర్ల డబుల్ విక్టరీ

దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో మహిళా నేతలు తమ పట్టు నిరూపించుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఆస సులోచన(11వ వార్డు), సంధ్య రాణి (6వ వార్డు) వరుసగా రెండోసారి కౌన్సిలర్లుగా ఎన్నికై కొత్త రికార్డు సృష్టించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వీరిద్దరూ భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం. రెండోసారి గెలుపొందిన వీరిని స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఘనంగా అభినందిస్తూ సంబరాలు జరుపుకున్నారు.


