News October 6, 2024

NGKL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పర్యాటక టూర్లు

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పురాతన గుడులు
పర్యటక ప్రదేశాలను చూపించనున్నారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2,4 తరగతుల ఒక్కో విద్యార్థికి రూ.300/- 5, 8 తరగతుల వారికి రూ.800/-, 9,ఇంటర్, వారికి రూ.2000/-డిగ్రీ విద్యార్థులకు రూ.4000/-చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరుగుతుంది. 3వేల విద్యార్థులకు అవకాశం దక్కనుందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వెల్లడించారు.

Similar News

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.

News February 8, 2026

MBNR: పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి

image

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.