News January 24, 2025

NGKL: ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి: కుమార్

image

వెల్దండ మండలం గుండాల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఏకలవ్య మోడల్ గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ పి.కుమార్ తెలిపారు. గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు, దివ్యాంగులైన విద్యార్థులు, ఐదో తరగతి చదివి మార్చి 2025 నాటికి 10 నుంచి 13 ఏళ్ల లోపు వారు అర్హులు అని పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

రూ.1.25కోట్ల ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి.. కానీ!

image

యువత, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని రాజకీయ ఉద్ధండులు పిలుపునివ్వడం చూస్తుంటాం. అలా ప్రజాశ్రేయస్సు కోసం ఏకంగా రూ.1.25కోట్ల ఉద్యోగాన్ని వదిలొచ్చి పోటీ చేసి ఓడిపోయాడో యువకుడు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం కోల్‌కత్తాలో చదివి జర్మనీలో ఉద్యోగం చేస్తోన్న శశాంత్ శేఖర్ కాంగ్రెస్ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. పట్నా సాహిబ్‌లో బీజేపీ అభ్యర్థి రత్నేష్ కుమార్‌ చేతిలో ఆయన 38,900 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

News November 19, 2025

వెంకటపాలెం: సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న విషయం తెలిసిందే. కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులతో చర్చించారు.

News November 19, 2025

ఎనుమాముల మార్కెట్‌‌లో పల్లికాయ క్వింటా రూ.6,210

image

చాలా రోజుల తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ (వేరుశనగ) తరలివచ్చింది. ఈ క్రమంలో పచ్చి పల్లికాయ క్వింటాకు రూ. 6,210 ధర రాగా, సూక పల్లికాయ రూ.4,500 ధర పలికింది. మరోవైపు, మార్కెట్‌కి వచ్చిన మొక్కజొన్న (మక్కలు) ధర భారీగా తగ్గింది. సోమవారం రూ. 2,080 ఉన్న ధర, ఈ రోజు రూ. 2,030కి పడిపోయింది.