News March 24, 2025
NGKL: ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 10,537 మంది హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసే విధానాన్ని పరిశీలించారు. డీఈఓ చీఫ్ సూపరింటెండెంట్లకు పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేందుకు సూచనలు ఇచ్చారు.
Similar News
News November 15, 2025
ఊడ్చే యంత్రాల అద్దె ఖరీదు తెలిస్తే షాకే!

బెంగళూరు రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ యంత్రాలను మరిన్ని అందుబాటులో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 46 స్వీపింగ్ యంత్రాలను ఏడేళ్ల పాటు అద్దెకు తీసుకునేందుకు ఏకంగా రూ.613కోట్లను కేటాయించింది. శుభ్రతపై కర్ణాటక ప్రభుత్వ చొరవ అభినందనీయమే అయినా అంత డబ్బు అద్దెకు ఖర్చు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కొనుగోలు చేసినా ఇంత ఖర్చవదేమో.. ఎందుకంత డబ్బుల్రా బుజ్జీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
News November 15, 2025
3 – 20వ వారం వరకు గొర్రె పిల్లలకు ఆహారం

☛ 3- 7 వారాల వరకు తల్లిపాలతో పాటుగా అధిక పోషక విలువలు కలిగి సులువుగా జీర్ణమయ్యే క్రీపు దాణాను.. పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి. ఇలా చేస్తే 7 వారాలకు పిల్లలు కనీసం 12kgల బరువు పెరుగుతాయి.
☛ 8 నుంచి 20వ వారం వరకు పిల్లలకు మేతను T.M.R (టోటల్ మిక్స్డ్ రేషన్) రూపంలో అందించాలి. టి.ఎం.ఆర్తో పాటుగా గొర్రెలకు పరిశుభ్రమైన తాగు నీటిని అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
News November 15, 2025
అల్లూరి జిల్లాలో బస్తరు.. అ’ధర’హో..!

అల్లూరి జిల్లా బస్తరు పిక్కలకు ప్రసిద్ధి. అత్యధిక పోషక విలువలు కలిగిన ఈ పిక్కలను వివిధ రకాల కూరల్లో వినియోగిస్తారు. పాడేరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో ఎక్కువగా లభిస్తాయి. కిలో పిక్కలు శనివారం రూ.250 పలికిందనిగత ఏడాది రూ.100 ఉండేదని పాడేరు వాసులు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలు వలన పంట దెబ్బతిన్నాదని, దీంతో డిమాండ్ పెరిగి రేటు పెరిగిందని వెల్లడించారు.


