News February 27, 2026
NGKL: ప్రశాంతంగా ముగిసిన మూడో రోజు ఇంటర్ పరీక్షలు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 7,163 మంది విద్యార్థులకు గాను 6,908 మంది హాజరు కాగా, 255 మంది గైర్హాజరైనట్లు నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 15, 2026
IIGMలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం (IIGM), నవీ ముంబై.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60% మార్కులతో MSc పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు – రూ.100. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి 30-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు iigm.res.in/careers చూడండి.
News April 15, 2026
GNT: మహిళ హత్యకేసులో ఇద్దరి అరెస్ట్

తీసుకున్న డబ్బు చెల్లించమని అడిగిన మహిళను హత్య చేసిన లాయర్‌తో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతగుంటూరుకు చెందిన రమాదేవి(46)వద్ద లాయర్ సురేశ్ రూ.10లక్షలు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని ఇప్పించకుండా మోసంచేశాడు. తిరిగి చెల్లించమని అడిగితే డబ్బులు ఇస్తానని పిలిచి ఫిబ్రవరి 16న సంగజాగర్లమూడి వద్ద పంట కాలువలోకి తోసి చంపేశారు. సురేశ్‌తోపాటు అతని స్నేహితుడు శేఖర్‌ని అరెస్ట్ చేశారు.
News April 15, 2026
మద్దతు ధర దక్కక గుంటూరు రైతుల ఆవేదన

జిల్లాలో దిగుబడులు బాగున్నా మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ 79,200 ఎకరాల్లో మొక్కజొన్న, 48,465 ఎకరాల్లో శనగ సాగైంది. మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రైవేటు మార్కెట్‌లో రూ.1,700కే అమ్ముతూ క్వింటాల్‌కు రూ.700 నష్టపోతున్నారు. కంది మద్దతు ధర రూ.8 వేలు కాగా రూ.7 వేలకే ఇస్తున్నారు. శనగ రైతులకూ ఎకరాకు రూ.5 వేల నుంచి 7 వేల దాకా నష్టం వస్తోంది. నిల్వ సదుపాయాలు లేక దళారులకు తక్కువకి అమ్ముతున్నారు.


