News March 15, 2025

NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

image

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్‌పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్‌తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News March 16, 2025

జడ్చర్ల: మహిళ ఆత్మహత్య.. కేసు నమోదు

image

మండలంలోని కోల్‌బాయితండాకు చెందిన శారద(45) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. శారద భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో కుమారుడు, కోడలి దగ్గర కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వీరిద్దరూ తనను వేధిస్తున్నారని తండ్రి తథ్యుతో వాపోయింది. ఈ నేపథ్యంలోనే శారద ఆత్మహత్య చేసుకోగా.. అందుకు కారకులుగా మృతురాలి కుమారుడు, కోడలే అని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News March 16, 2025

MBNR: బావిలో పడి వ్యక్తి మృతి

image

మిడ్జిల్ మండలంలో ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానికుల వివరాలు.. వేములకు చెందిన చంద్రయ్య(50) గురువారం రాత్రి గ్రామంలో చేసిన కాముడి దహన కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా.. గ్రామ సమీపంలోని బావిలో పడిపోయారు. ఎవరూ గమనించకపోవటంతో మునిగిపోయారు. ఈ క్రమంలో శనివారం శవమై తేలాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

News March 15, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.

error: Content is protected !!