News March 15, 2025
NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News November 21, 2025
ADB: జాతీయ రహదారిని అడ్డుకోవడం చట్టరీత్య నేరం: డీఎస్పీ

జాతీయ రహదారిపై అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని వాటిని అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని ADB డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. యువత కేసుల బారిన పడకుండా వారి భవిష్యత్తులను నాశనం చేసుకోకూడదని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక, వాహనాలు ఆస్పత్రిలకు వెళ్లేవారికి అసౌకర్యం కలిగే చర్యలు చేయవద్దన్నారు. యువత కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోకుండా ఉండాలని సూచించారు.
News November 21, 2025
మూవీ అప్డేట్స్

* విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ డిసెంబర్ 15న సెట్స్పైకి వెళ్లే అవకాశం. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో తన కామియో షూటింగ్ పూర్తి కాగానే వెంకటేశ్ ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతారని టాక్.
* ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ మ్యాన్-3. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.
* ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని రాజాసాబ్ టీమ్ వెల్లడి.
News November 21, 2025
MNCL: కంప్యూటర్ల విడి భాగాలు విక్రయం

మంచిర్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సేకరించిన ఉపయోగంలో లేని కంప్యూటర్ల విడి భాగాలను విక్రయించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 717 మానిటర్లు, 316 సీపీయు, 296 యుపిఎస్, 70 ప్రింటర్స్, 26 కంప్యూటింగ్ యూనిట్స్, 636 కేబుల్ కీ బోర్డ్స్, 288 మౌస్ ఉన్నట్లు పేర్కొన్నారు. కొనదలిచిన వారు రూ.10 వేలు ధరావత్తు సొమ్మును కొనే ధర కోడ్ చేసి సీల్డ్ కవర్లో ఈ నెల 25 సాయంత్రం 4 గంటల లోపు సమర్పించాలని సూచించారు.


