News March 15, 2025
NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్‌పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్‌తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News April 10, 2026
ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని ఇంటర్ విద్యార్థి సూసైడ్

పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే ఆందోళనతో ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్ మండలం రాపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి గంగాదేవుళ్ల ఆశాంత్ గురువారం రాత్రి మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్కే ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 10, 2026
HYD: జిల్లా కోర్టుల జడ్జీల బదిలీలు, పోస్టింగ్

జిల్లా& సెషన్స్ కోర్టుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. సిటీ సివిల్ కోర్టు అడిషనల్ చీఫ్ సివిల్ జడ్జి 3- శ్రీనివాసరావు ఖమ్మం& సెషన్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. HYD మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి డా.మహేశ్‌నాథ్, ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్, అడిషనల్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్బీనగర్ RR జిల్లా XII డిస్టిక్ & అడిషనల్ సెషన్స్ జడ్జిగా అనిత రానున్నారు.
News April 10, 2026
ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్‌కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.


