News February 19, 2025
NGKL: ప్రేమ పేరుతో మోసం.. బాలికకు 9 నెలల కొడుకు

ప్రేమ పేరుతో ఓ బాలికను మోసంచేసి తల్లిని చేసిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. భూత్పూర్ మం. కొత్తమూల్గరకు చెందిన ఎండీ జాఫర్(33) RTCలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయగా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాలిక పోలీసులను నిన్న ఆశ్రయించింది. ప్రస్తుతం బాలికకు తొమ్మిదినెలల కుమారుడు ఉన్నాడు.
Similar News
News March 21, 2025
పెంబి: అన్నం పెట్టలేదని భార్యను చంపాడు!

అన్నం పెట్టడం లేదని భార్యని చంపాడో భర్త. ఖానాపూర్ పోలీసుల వివరాలు.. పెంబి పరిధిలోని దాసునాయక్ తండాకి చెందిన అర్జున్‌కు గోసంపల్లికి చెందిన నిరోజతో వివాహం జరిగింది. కాగా భర్త మద్యానికి బానిసై రోజు గొడవపడే వాడు. ఈ నెల 18న మద్యం తాగి వచ్చి భోజనం పెట్టలేదని గొడవపడ్డాడు. నిరోజను కిందపడేసి కొట్టి, గొంతుపై కాలువేసి తొక్కడంతో ఆమె మృతిచెందింది. నిరోజ అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
News March 21, 2025
భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News March 21, 2025
పాస్టర్ల వేతనాలకు రూ.12.82 కోట్లు విడుదల

రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు వేతనాల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.12.82 కోట్లు విడుదల చేసిందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు నెలకు ఒక్కొక్కరికి రూ.5000 ప్రకారం వేతనం ఇస్తామన్నారు. గతేడాది మే నెల నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు.