News February 19, 2025

NGKL: ప్రేమ పేరుతో మోసం.. బాలికకు 9 నెలల కొడుకు

image

ప్రేమ పేరుతో ఓ బాలికను మోసంచేసి తల్లిని చేసిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. భూత్పూర్ మం. కొత్తమూల్గరకు చెందిన ఎండీ జాఫర్(33) RTCలో అద్దె బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిలదీయగా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాలిక పోలీసులను నిన్న ఆశ్రయించింది. ప్రస్తుతం బాలికకు తొమ్మిదినెలల కుమారుడు ఉన్నాడు.

Similar News

News March 26, 2025

ఇఫ్తార్ విందుకు ఈసీ నో

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించదలచిన ఇఫ్తార్ విందుకు ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఈ కార్యక్రమంలో సీఎం, ఇతర నేతలు పాల్గొంటారని పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాయగా ఈసీ తిరస్కరించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

News March 26, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤MBNR: రేపు PUలో ఉగాది వేడుకలు
❤గద్వాల డిపో మేనేజర్‌కు సన్మానం
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చలివేంద్రం
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤నాగర్‌కర్నూల్‌లో క్షుద్ర పూజల కలకలం
❤మార్చి 31 వరకు పన్నులు చెల్లించండి:కలెక్టర్లు
❤ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్లు
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News March 26, 2025

బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీలో కీలక పదవి

image

AP: శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అలాగే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

error: Content is protected !!