News January 29, 2025

NGKL: ఫిజిక్స్ ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

బిజినేపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీటీ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ సందర్భంగా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ సుమతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ బీఈడీ కెమిస్ట్రీ, లేదా ఎంఎస్సీ బీఈడీ ఫిజిక్స్ అభ్యర్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ తెలిపారు.

Similar News

News December 16, 2025

ఎగ్జామ్ ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఫస్ట్, సెకండియర్ చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టింది. రూ.5వేల ఫైన్‌తో ఈ నెల 22 నుంచి JAN 5 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గత నెలలోనే గడువు ముగిసింది.

News December 16, 2025

నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.

News December 16, 2025

యాదాద్రి: ఓటుకు నోటు.. హాఫ్ మందు..!

image

యాదాద్రి జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో నెగ్గేందుకు అభ్యర్థులు ఓటర్లను మభ్యపెడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో రియల్టర్లు, వ్యాపారులు బరిలో ఉన్నచోట ఓటుకు రూ.1000 నుంచి రూ.2000పైనే ముట్టజూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలను మించి మద్యం ఏరులై పారుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. మందుబాబులు ఇదే అదునుగా క్వాటర్‌కు బదులు హాఫ్ బాటిల్ బ్రాండెడ్ మద్యం కావాలని డిమాండ్ చేస్తున్నారట.