News March 12, 2025
NGKL: బడ్జెట్‌పై జిల్లా ప్రజల్లో ఎన్నో ఆశలు.!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయింపు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు, రోడ్లు, ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
Similar News
News November 21, 2025
కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.
News November 21, 2025
NPCILలో 122 పోస్టులు.. అప్లై చేశారా?

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) 122 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://npcilcareers.co.in
News November 21, 2025
పెద్దపల్లి: ఐపీఎస్ అధికారి బి.రామ్ రెడ్డి బదిలీ

సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ (2020) బదిలీ అయ్యారు. ఆయన్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఉన్న శ్రీ పి. కరుణాకర్, ఎస్పీ (ఎన్సీ) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.


