News March 12, 2025

NGKL: బడ్జెట్‌పై జిల్లా ప్రజల్లో ఎన్నో ఆశలు.!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయింపు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు, రోడ్లు, ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

Similar News

News March 23, 2025

మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

image

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

image

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 23, 2025

ప్రజలకు విద్య, వైద్యం చాలా ముఖ్యం: శబరీష్

image

నేటి సమాజంలో ప్రజలకు విద్య వైద్యం ఎంతో ముఖ్యమని ములుగు ఎస్పీ శబరీష్ అన్నారు. వాజేడు మండలం కొంగాల గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు పోలీసుల ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ అన్నారు. సమాజంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!