News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 23, 2025
పర్యాటక అద్భుతాలు పరిచయం చేస్తే బహుమతులు: ASF కలెక్టర్

కొమురం భీమ్ జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పర్యాటక శాఖ అధికారి అష్ఫాక్ అహ్మద్‌తో కలిసి ‘100 వీకెండ్ వండర్స్’ గోడ ప్రతులను ఆవిష్కరించారు.
News December 23, 2025
నేడు నల్గొండకు KTR

ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రానికి మంగళవారం మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రానున్నారు. నల్గొండ జిల్లాలో BRS పార్టీ బలపరిచి గెలుపొందిన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను కలిసి KTR అభినందిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు సమయానికి హాజరుకావాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు.
News December 23, 2025
MNCL: నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం

2026 మార్చిలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌లో తప్పులు ఉంటే సవరించేందుకు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. విద్యార్థుల వార్షిక మెమోలలో ఎలాంటి తప్పులు రాకుండా, అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం మార్పులు ఉంటే పాఠశాల ఎస్ఎస్సీ లాగిన్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని సూచించారు.


