News February 11, 2025

NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

image

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 23, 2025

NLG: సన్నబియ్యం లబ్ధిదారులు ఎంతమందంటే.. 

image

ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే రేషన్ డీలర్లతో సమీక్షలు నిర్వహించి పంపిణీపై చర్చించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 10,07,011 రేషన్ కార్డులు ఉండగా.. ఇందులో 29,82,694 యూనిట్లు ఉన్నాయి. వీరి కోసం ప్రతినెల 19 వేలకు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు.

News March 23, 2025

నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

image

నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. MLG, వేములపల్లి, తిప్పర్తి, హాలియా, NDMNR, కనగల్, మునుగోడు, NKL ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. 

News March 23, 2025

భగ్గుమంటున్న వనపర్తి

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా విలియంకొండ 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 37.7, పెబ్బేరు 37.6, గోపాల్ పేట 37.5, దగడ 37.5, మదనాపూర్ 37.5, కానాయిపల్లి 37.4, ఆత్మకూర్ 37.2, కేతపల్లి 37.2, పానగల్ 37.1, రేమద్దుల 36.9, ఘన్పూర్ 36.7, వెలుగొండ 36.6, వనపర్తి 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!