News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 22, 2025
‘డిజిటల్ గోల్డ్’ను నియంత్రించం: సెబీ చీఫ్

డిజిటల్ గోల్డ్, ఈ-గోల్డ్ ఉత్పత్తులు తమ పరిధిలో లేవని, వాటిని నియంత్రించాలని అనుకోవడం లేదని SEBI చీఫ్ తుహిన్ పాండే తెలిపారు. సెబీ పరిధిలోని మ్యూచువల్ ఫండ్స్ ETFలు, ఇతర గోల్డ్ సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. డిజిటల్ గోల్డ్ తమ పరిధిలోకి రాదని, అది రిస్క్ అని ఇటీవల సెబీ హెచ్చరించింది. దీంతో తమనూ నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని డిజిటల్ గోల్డ్ పరిశ్రమ కోరడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.
News November 22, 2025
ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్‌వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.
News November 22, 2025
లేబర్ కోడ్స్‌పై మండిపడ్డ కార్మిక సంఘాలు

కేంద్రం అమల్లోకి తెచ్చిన 4 <<18350734>>లేబర్ కోడ్స్<<>>ను కార్మిక సంఘాలు ఖండించాయి. కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని 10 లేబర్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. శ్రామికులపై యుద్ధం ప్రకటించడం తప్ప మరేమీ కాదు. పెట్టుబడిదారులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’ అని మండిపడ్డాయి. లేబర్ కోడ్స్‌ను విత్ డ్రా చేసుకునే దాకా తాము పోరాటం చేస్తామని ప్రకటించాయి.


