News February 4, 2025

NGKL: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News December 17, 2025

MDK: ఎన్నికల్లో ముగ్గురు బాల్య మిత్రులు గెలుపు

image

తూప్రాన్ మండలం ఘనాపూర్ జీపీలో బాల్యమిత్రులు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఎస్ఎస్సీ బాల్య మిత్రులైన సురేష్, వేణు, సయ్యద్ అన్వర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. వేణు, సురేష్‌లకు వార్డులలో సభ్యులుగా పోటీ చేయడానికి రిజర్వేషన్ అనుకూలించింది. అన్వర్‌కు అనుకూలించకపోవడంతో తల్లి నజ్మా బేగంను ఎన్నికలలో నిలిపారు. సురేష్, వేణు, నజ్మా బేగం, (అన్వర్ తల్లి) వార్డు సభ్యులుగా గెలిచారు.

News December 17, 2025

పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

image

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.

News December 17, 2025

సిద్దిపేట జిల్లాలో పోలింగ్ START

image

సిద్దిపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. జిల్లాలోని 163పంచాయతీలకు 13 ఏకగ్రీవమవగా మిగితా 150గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.