News March 24, 2025
NGKL: మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన ఎంపీలు

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులు డాక్టర్ మల్లురవి సోమవారం దిల్లీలో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను ఖర్గేకు ఆయన వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం గుర్తు చేశారు.
Similar News
News December 8, 2025
స్కూళ్లకు సెలవులపై ప్రకటన

TG: ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా, 11న పోలింగ్ ఉండటంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుండగా ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.
News December 8, 2025
ఎచ్చెర్ల: పీజీలో సీట్లకు ప్రవేశాలు

డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్లలో వివిధ పీజీ కోర్సుల్లో (ఎం.ఎ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.ఇడి) మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి. అడ్డయ్య సోమవారం తెలిపారు. ఈ ప్రవేశాలు ఈ నెల 9న మంగళవారం నుంచి క్యాంపస్లో జరుగుతాయన్నారు. ఏపీపీజీసెట్ రాసినా, రాయకపోయినా సీటు పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్స్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
News December 8, 2025
రామచంద్రపురంలో డెంగ్యూ కలకలం

రామచంద్రపురం అంకంవారి వీధిలో ఒక మహిళకు డెంగ్యూ సోకడంతో వైద్యారోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. డీఎంఓ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సోమవారం ఆ వీధిలో సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.


