News January 5, 2025
NGKL మాజీ ఎంపీకి జూపల్లి పరామర్శ

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా HYD ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆసుపత్రికి చేరుకొని మంద జగన్నాథంను పరామర్శించారు. అనంతరం ఆయన కుమారుడు మంద శ్రీనాథ్‌ను మంత్రి పలకరించి మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 13, 2025
పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.
News December 13, 2025
MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.
News December 13, 2025
సిరి వెంకటాపూర్‌లో అత్యంత ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి, దోనూరు, కోయిలకొండ మండలం పారుపల్లి 10.6, మిడ్జిల్ 10.9, మహబూబ్‌నగర్ గ్రామీణం 11.0, దేవరకద్ర, రాజాపూర్ 11.1, మహమ్మదాబాద్, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 11.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.


