News March 22, 2024

NGKL: మాజీ సీఎం KCRకు ధన్యవాదాలు: RSP

image

తన మీద నమ్మకంతో రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి BRS అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా మాజీ CM KCRకు RS ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ‘నేను మీ నమ్మకాన్ని వమ్ముచేయను. పేద ప్రజలకిచ్చిన మాట తప్పను’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు శ్రేయోభిలాషులకు బాధ పెట్టి ఉండోచ్చు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవన్నారు.

Similar News

News April 11, 2026

MBNR: భానుడి భగభగలు.. 41.1 డిగ్రీలు నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఎండలు ప్రచండ రూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో చిన్నచింతకుంటలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ (41.0), కౌకుంట్ల (40.9) ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. భూత్పూర్, మిడ్జిల్, మహమ్మదాబాద్ మండలాల్లో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News April 10, 2026

మహబూబ్‌నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

image

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.