News February 27, 2025
NGKL: మార్చి 2న వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి మార్చి 2న వనపర్తికి రానున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో జరిగే ఉద్యోగ మేళాకు అతిథిగా సీఎం రానున్నారని మల్లు రవి తెలిపారు.
Similar News
News December 5, 2025
ప్రకాశం: నెలకు రూ.2 లక్షల శాలరీ.. డోంట్ మిస్.!

అబుదాబి, దుబాయ్ ప్రాంతాల్లో హోమ్ కేర్, నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 40 సంవత్సరాలు గల మహిళలు అర్హులని, నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా ప్రకాశం జిల్లా నైపుణ్యం వెబ్సైట్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
ఎన్నికల సిబ్బందికి రేపు శిక్షణ: కలెక్టర్

గ్రామ పంచాయతీల తొలి విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా నియమించిన సిబ్బంది డిసెంబర్ 6న జరగనున్న శిక్షణా కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. హాజరు విషయంలో మినహాయింపు ఉండదని, గైర్హాజరైతే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
వాస్తు అంటే ఏమిటి? దాని పాత్ర ఏంటి?

వాస్తు అనేది ఇంటిని వాస్తవాలకు అనుగుణంగా అమర్చే శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు అంటున్నారు. ‘ప్రతి మనిషికి అత్యవసరమైన సుఖం, సంతోషం, తృప్తి ఒక నివాసంలో లభించాలి. వాస్తు నియమాలు ఈ ఆశయాలను చేరుకోవడానికి సరైన దిశను సూచిస్తాయి. ఇవి ఇల్లు నిర్మాణంలో, సర్దుబాటులో నియమాలను పాటించేలా చేసి, మన జీవితంలో సాఫల్యాన్ని, మంచి ఫలితాలను అందిస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


