News February 14, 2026

NGKL: మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6

image

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్థానిక ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 24 వార్డులకు గాను 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 6 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో పై చేయి సాధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

Similar News

News March 13, 2026

NLG: ఒక్కో పంటపై రూ.2వేల పెంపు..!

image

రాబోయే సాగు సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల రుణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఒక్కో పంటపై అదనంగా రూ.2,000లు పెంచుతూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లాలోని సుమారు 5,65,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

News March 13, 2026

ఇళ్లు లేనివారికి శుభవార్త

image

AP: రాష్ట్రంలో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

News March 13, 2026

ఫైల్స్ క్లియెరెన్స్‌లో అచ్చెన్న బెస్ట్

image

పరిపాలన విభాగంలో ఫైల్స్ క్లియరెన్స్ అన్నది కీలకం. రాష్ట్ర మంత్రుల్లో మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో 3,362 ఫైల్స్‌ను క్లియర్ చేశారు. 551 గంటలు ఫైల్స్ క్లియరెన్స్‌కు సమయం తీసుకున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు.