News February 14, 2026
NGKL: మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్థానిక ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 24 వార్డులకు గాను 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 6 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో పై చేయి సాధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
Similar News
News March 13, 2026
నిర్మల్: ఈ నెల 16న ప్రజావాణి రద్దు

జనాభా గణన నేపథ్యంలో ఈ నెల 16న కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబడడం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News March 13, 2026
అనకాపల్లి: 124 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
News March 13, 2026
NZB: ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


