News February 14, 2026

NGKL: మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6

image

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలలో స్థానిక ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 24 వార్డులకు గాను 18 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 6 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో పై చేయి సాధించి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

Similar News

News March 9, 2026

కరీంనగర్: ఈనెల 12 వరకే ఛాన్స్..!

image

క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అద్భుత అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్ పాఠశాలలో మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈనెల 12వ వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులు.

News March 9, 2026

మెట్రో-ఫ్లైఓవర్లతో విశాఖ ట్రాఫిక్‌కు పరిష్కారం

image

విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు కీలకం కానుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్. రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ వివరాలను సీఐఐ విజయవాడ వార్షిక సమావేశంలో వెల్లడించారు. 76.70 కి.మీ. పొడవున 4 కారిడార్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎన్‌హెచ్-16 వెంట మెట్రో-కమ్ నాలుగు లేన్ ఫ్లైఓవర్ ప్రతిపాదించామన్నారు. మొత్తం 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.

News March 9, 2026

నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.