News March 31, 2025

NGKL: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలందరూ ప్రవక్త సూచించిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ముస్లింలు అతిపెద్ద పండుగగా నిర్వహించే రంజాన్ వారి యొక్క కుటుంబాలలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

Similar News

News November 22, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు JNTU హైదరాబాద్ గొప్ప అవకాశం

image

బీటెక్​ చదివిన ప్రతి విద్యార్థినికి ఉద్యోగం రావాలని JNTU హైదరాబాద్​ అధికారులు కొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చారు. క్యాంపస్​ ఇంటర్వ్యూల్లో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన విద్యార్థినులకు ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించేందుకు సాయం చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరులోని ఎమర్టెక్స్​ అనే ఐటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. JNTUలో చదివితే ఉద్యోగం ఖాయం అనే ధీమాను కల్పిస్తున్నారు.

News November 22, 2025

మైలార్‌దేవ్‌పల్లి‌లో గుండెపోటుతో విద్యార్థి మృతి

image

గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బాబుల్‌రెడ్డినగర్‌లో అభయ్ అనే విద్యార్థి ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో బాబుల్‌రెడ్డినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 22, 2025

IIITకల్యాణిలో నాన్ టీచింగ్ పోస్టులు

image

IIITకల్యాణి, పశ్చిమబెంగాల్‌లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iiitkalyani.ac.in