News March 29, 2025
NGKL: మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం..!

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం చెలరేగిందని స్థానికులు తెలిపారు. ఈనెల 25న జూనియర్ విద్యార్థి, రాజస్థాన్‌కు చెందిన దీపక్ శర్మను నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు.
Similar News
News April 20, 2025
జిల్లాలో మంచిని సమస్య లేకుండా చూడండి: రాజనర్సింహ

జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా మంచిది సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2025
పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
News April 20, 2025
ICICIకి రూ.13,502 కోట్ల నికర లాభం

జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ICICI ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 15.7 శాతం మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.