News February 1, 2025
NGKL: మైనర్ బాలికకు వేధింపులు.. కేసు నమోదు

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 15, 2025
చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 15, 2025
ఏలూరు: 72 ప్రైవేటు బస్సులపై కేసులు..రూ.7.65 లక్షల జరిమానా

ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి రవాణా శాఖ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మొత్తం 72 ప్రైవేటు బస్సులపై కేసుల నమోదు చేశామని డీటీసీ(జిల్లా రవాణాధికారి కమిషనర్) షేక్ కరీం తెలిపారు. ఏలూరు హైవేలోని కలపర్రు వద్ద తనిఖీలు జరగగా..రూ. 7.65 లక్షల జరిమానా విధించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపితే సీజ్ చేస్తామని డీటీసీ హెచ్చరించారు.
News November 15, 2025
ప్రజాస్వామ్య విలువలు పతనం: జగన్

AP: హిందూపురంలోని YCP కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు <<18297222>>దాడి<<>> చేశారని జగన్ ట్వీట్ చేశారు. ‘ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నీచర్, అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలపై దాడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుందని అన్నారు.


