News March 6, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన కేతావత్ మైబు నాయక్(23) బుధవారం సాయంత్రం మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు. మైబు నాయక్ అందరితో ప్రేమగా, మైత్రిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

Similar News

News December 5, 2025

14,967 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. DEC 4తో గడువు ముగియగా.. DEC 11 వరకు పొడిగించారు. ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

News December 5, 2025

మొదటి విడత.. 461 సర్పంచ్, 1,954 వార్డు స్థానాలకు పోటీ

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 7 మండలాల్లోని మొత్తం 122 సర్పంచ్, 1,172 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 122 సర్పంచి స్థానాలకు గాను మొత్తం 461 మంది, అలాగే 1,172 వార్డు స్థానాలకు గాను మొత్తం 1,954 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News December 5, 2025

కామారెడ్డిలో పర్యటించిన బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి

image

కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి విక్రమ్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయనకు జిల్లాలో బీజేపీ సంస్థాగత వివరాలను వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై, నాయకత్వం గురించి తెలిపారు. BJP సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పైడి ఎల్లారెడ్డి, హైమారెడ్డి, BJP నాయకులు పాల్గొన్నారు.