News March 6, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్ దిన్నె గ్రామానికి చెందిన కేతావత్ మైబు నాయక్(23) బుధవారం సాయంత్రం మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగారు. మైబు నాయక్ అందరితో ప్రేమగా, మైత్రిగా ఉండే వ్యక్తి అని గ్రామస్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

Similar News

News March 18, 2025

జగిత్యాల: కనుమరుగవుతున్న ఎడ్ల బండ్లు!

image

నాగరికత అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడ్ల బండి. పూర్వం రైతులు ప్రతి అవసరానికి ఎడ్ల బండిని వాడేవారు. ప్రస్తుత రోజుల్లో ఎడ్ల బండి కనుమరుగై మ్యూజియంలో బొమ్మగా మారింది. జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ బండ్లు వచ్చినప్పటి నుండి ఎడ్ల పనులను ఉపయోగించడం తగ్గింది. రైతులు ఎడ్లను తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది.

News March 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 18, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 18, 2025

MNCL: బంగారం చోరీ.. ఇద్దరి అరెస్ట్: ACP

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోషంను కత్తితో చంపుతామని బెదిరించి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ జుబీర్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ సోమవారం తెలిపారు. సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, కత్తి, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!