News May 26, 2024
NGKL: యువకుడి ప్రాణం తీసిన గాలివాన

NGKL జిల్లాలో ఈదురుగాలులతో కూడిన గాలివాన ఓ యువకుడి ప్రాణం తీసింది. కారులో కుర్చున్న వ్యక్తికి కారు అద్దాలు గుచ్చుకుని చనిపోయాడు. స్థానికుల కథనం.. వేణుగోపాల్(35) కారు డ్రైవర్. యాత్రికులను తీసుకొని శ్రీశైలం వెళ్లి తిరుగు వస్తున్నారు. ఈ క్రమంలో NGKL సమీపంలో మంతటి వద్ద రేకుల షెడ్డు ఇటుక పెళ్ల ఎగిరి కారుపై పడింది. దీంతో కారు అద్దం పగిలి గుచ్చుకొని వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 7, 2025
నేటి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరా స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన స్వామివారికి నేడు మొదటి రోజు అమ్మవార్ల ఊరేగింపు సేవ, 8న హంస వాహన సేవ, 9న ధ్వజ వాహన సేవ, 10న సూర్యప్రభ వాహన సేవ, 11న హనుమ వాహన సేవ,12న గరుడ వాహన సేవ,13న అశ్వవాహన సేవ,14న దర్బార్ సేవ,15న శేష వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News February 7, 2025
గద్వాల: ట్రాన్స్ జెండర్‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News February 7, 2025
MBNRలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా న్యూ <<1538043>>టౌన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి అతివేగంగా, ఆజాగ్రత్తగా బైక్ నడపడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపేట జిల్లాకు చెందిన శశాంక్ (19) నల్గొండకు చెందిన జ్ఞానేశ్వర్ (18) మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.