News April 1, 2025

NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

image

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.

Similar News

News November 16, 2025

18న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

image

టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈనెల 18వ తేదీన జరగనుంది. కొన్ని ముఖ్యమైన అంశాలతో కూడిన సమావేశం కావడం, ఆ నిర్ణయాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండడంతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. టీటీడీ బోర్డు సెల్ అధికారులు సమావేశ అజెండా రూపకల్పనలో బిజీగా ఉన్నారు.

News November 16, 2025

HYD: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష .

image

డిసెంబర్ 8- 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఫ్యూచర్ సిటీ, ముచ్చర్లలో భారీ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ విడుదల చేయనున్నారు. 2035నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంమని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంపై దృష్టి పెట్టామని, 70 థీమాటిక్ స్టాల్స్ తెలంగాణ అభివృద్ధి ప్రతిరూపమన్నారు.

News November 16, 2025

‘వారణాసి’ గ్లింప్స్.. ఇవి గమనించారా?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ నుంచి రిలీజైన గ్లింప్స్ SMను షేక్ చేస్తోంది. 3.40 నిమిషాల నిడివి ఉన్న ఈ విజువల్ వండర్‌ను నెటిజన్లు డీకోడ్ చేసే పనిలోపడ్డారు. వారణాసి(512CE)లో మొదలయ్యే టైమ్ ఫ్రేమ్ వారణాసి(మణికర్ణికా ఘాట్)లోనే ముగుస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో ఎక్కడో ఒకచోట మహేశ్ కనిపించేలా వీడియో రూపొందించారని పేర్కొంటున్నారు. గ్లింప్స్ మీకెలా అనిపించింది?