News February 23, 2025

NGKL: యువతి SUICIDE

image

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.

Similar News

News December 1, 2025

అధ్యక్షా.. RDTని రక్షించండి!

image

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్డీటీకి FCRA రెన్యువల్ విషయంపై వారు గళమెత్తాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాయదుర్గం, అనంత, హిందూపురంలో రైల్వే సమస్యలు.. అరటి, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు, వేగవంతంపై ఎంపీలు గొంతు విప్పాల్సిన అవసరముంది.

News December 1, 2025

సంగారెడ్డి: నేడు ఎన్నికల విధులపై శిక్షణ

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు నేడు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు శిక్షణకు హాజరు కావాలని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

image

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.