News February 1, 2025
NGKL: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందిస్తాం: ఎమ్మెల్సీ

రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ మండలంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పనికట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.
Similar News
News February 13, 2025
పంచాయతీ ఎన్నికలను సన్నద్ధం కావాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. బుధవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్ 1, స్టేజ్ స్టేజ్2 నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు.
News February 13, 2025
ముప్కాల్: హైవేపై యాక్సిడెంట్ వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయసు సుమారు 50-60 మధ్యలో ఉంటుంది. అతను తెల్ల చొక్కా లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించలన్నారు.
News February 13, 2025
కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.