News February 18, 2025

NGKL: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

తెలకపల్లి మండలం మదనాపురం గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. రాకొండకు చెందిన పెద్ద పర్వతాలు(60) బైక్‌పై పెద్దూరు నుంచి తెలకపల్లికి వస్తున్నారు. గేట్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన పర్వతాలుని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.

Similar News

News April 14, 2026

ప్రపంచ మేధావి అంబేడ్కర్: కలెక్టర్ వెట్రిసెల్వి

image

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని కలెక్టర్ వెట్రిసెల్వి కొనియాడారు. ఏలూరు కలెక్టరేట్‌లో అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన అంబేడ్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

News April 14, 2026

పాలమూరు: ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ గ్రేడ్-IV కార్యదర్శి కిషన్, కొల్లాపూర్ మండలంలోని సింగోటం పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి అర్జునయ్య, అంకిరావుపల్లి పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి ప్రేమ్ చంద్‌లను విధుల నుంచి తొలగించారు.

News April 14, 2026

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

image

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.