News February 13, 2025

NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్‌పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News November 7, 2025

జగిత్యాల: రాయితీ పనిముట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉద్యాన యాంత్రీకరణలో భాగంగా రైతులకు వివిధ రకాల పనిముట్లు, యంత్రాల కొనుగోలుపై రాయితీ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ తెలిపారు. పవర్ టిల్లర్లు, పవర్ విడర్లు, పవర్ స్పెయర్లూ, బ్రష్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పరిధికి చెందిన ఉద్యాన అధికారులను లేదా జగిత్యాలలోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయంలో 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News November 7, 2025

అనకాపల్లి: యువజన ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

image

జిల్లా యువజన సంక్షేమ శాఖ అనకాపల్లి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్‌ను గురువారం కలెక్టర్‌ విజయ కృష్ణన్ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి ఏఎమ్ఏఎల్ కళాశాలలో జిల్లా స్థాయి యువజన విభాగ పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో గెలిచిన వారిని రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో గెలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తామన్నారు.

News November 7, 2025

మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

image

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్‌మెంట్‌ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.