News March 11, 2025
NGKL: వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ వట్టెం వెంకన్న స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల సందడిలో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
సిరిసిల్ల: సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త: ఎస్పీ

పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 23, 2025
నిర్మల్: పర్యటన రూట్ కాదు.. రిస్క్ రూట్

గడిచిన పది నెలల్లో జిల్లాలో 522 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 139 మంది ప్రాణాలు కోల్పోగా.. 612 మంది క్షతగాత్రులు గాయపడ్డారు. ప్రధానంగా నిర్మల్-భైంసా, బాసర-భైంసా, నిర్మల్-ఖానాపూర్ మార్గాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని ఎస్పీ జానకి షర్మిలా సూచించారు.


