News March 11, 2025
NGKL: వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ వట్టెం వెంకన్న స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల సందడిలో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 5, 2026
పాలమూరు వర్సిటీ విద్యార్థులకు రూ.6లక్షల ప్యాకేజీ

పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులు కొలువుల వేటలో సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఆరుగురు విద్యార్థులు ఏడాదికి రూ.6 లక్షల భారీ వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు శిక్షణ కాలంలో నెలకు రూ.15 వేల (ఏడాదికి 1.80 లక్షలు) చొప్పున వేతనం పొందుతారని, అనంతరం పూర్తి స్థాయి ప్యాకేజీ అందుతుందని వర్సిటీ ఉపకులపతి ప్రొ. శ్రీనివాస్ తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
News March 5, 2026
హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
News March 5, 2026
అల్లూరి జిల్లాలో 108 మంది ఇంటర్ పరీక్షలకు దూరం

అల్లూరి జిల్లాలో గురువారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 108మంది గైర్హాజర్ అయ్యారని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. అల్లూరి జిల్లాలో 513 మందికి గాను 473మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పోలవరం జిల్లాలో 578మందికి 510 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. ఈ రోజు జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో హిందీ, తెలుగు పరీక్షలు జరిగాయని చెప్పారు.


