News March 17, 2025

NGKL: వలస కార్మికుడి మృతి

image

కొల్లాపూర్ మండలంలో ఓ వలస కార్మికుడు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. అస్సాంలోని మాదాపూర్‌కి చెందిన వినోద్‌దాస్(35) ఎల్లూరు శివారులో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేసేందుకు వలస వచ్చాడు. ఆదివారం మద్యం తాగి నడుస్తుండగా రాయి తగిలి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

Similar News

News November 22, 2025

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్…!

image

ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి 22,265 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్‌కు సంబంధించి 19,163 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలతో కలిపి 183 కళాశాలలు ఉన్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేలు ఫైన్‌తో 25వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.

News November 22, 2025

పార్లమెంటులో ‘అమరావతి’ బిల్లు: పెమ్మసాని

image

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించే గెజిట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. CRDA కార్యాలయంలో మాట్లాడుతూ ‘రాజధాని రైతులకు 98% ప్లాట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాం. రాబోయే 15ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం సదుపాయాలు కల్పిస్తాం’ అని వివరించారు.

News November 22, 2025

బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bits-pilani.ac.in/