News February 13, 2025

NGKL: విద్యుత్ టవర్‌కు ఉరేసుకున్నాడు

image

మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిమ్మాజిపేట మం. కోడుపర్తికి చెందిన సురేశ్(21) తల్లి పేరుపై ఉన్న భూమిని పదేళ్ల కింద గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి పట్టా చేసుకున్నాడు. తమకు ఇస్తానన్న భూమి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో సురేశ్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ నిన్న ఇంట్లోంచి వెళ్లి పొలం వద్ద విద్యుత్ స్తంభానికి ఉరేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 6, 2025

BRSకు గుణపాఠం చెప్పాలి: మానకొండూర్ MLA

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS, BJPకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం షేక్‌పేటలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్‌ నేత అభివృద్ధి చేయలేదని, బీజేపీపై నమ్మకం లేదని విమర్శించారు.

News November 6, 2025

బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

image

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.

News November 6, 2025

మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

image

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్‌‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.