News February 4, 2025

NGKL: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

నేడు అమరావతిలో కేంద్ర మంత్రి పర్యటన.. షెడ్యూల్ ఇదే.!

image

అమరావతిలో పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఆమె షెడ్యూల్ విడుదల చేశారు. 9:30 నిమిషాలకు విజయవాడ నోవాటెల్ నుంచి బయలుదేరి 10 గంటలకు అమరావతి CRDA కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొని 12:50కు బయలుదేరి 1:45కు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారు.

News November 28, 2025

వరంగల్: జీఎన్ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం

image

నిత్యం ఏదో ఒక చెడ్డపేరుతో MGM వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రభుత్వ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో వార్షిక పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాగా.. నగరంలోని 9 ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులను పాస్ చేయించేందుకు కొందరు సిబ్బంది భారీగా డబ్బులు వసూలుచేసి మాస్ కాపీయింగ్‌కు సహకరించారట. MGM ప్రాంగణంలోని గేటుకు తాళం వేసి ముడుపులిచ్చిన వారికి ఒక గది, ఇవ్వనివారికి మరో గదిలో వేసి కాపీయింగ్‌కు పాల్పడ్డారట.

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.